తెలంగాణలో వైసీపీకి భారీ షాక్ – కీలక నేత గుడ్ బై 

-

తెలంగాణలో వైసీపీ పెద్ద యాక్టీవ్ గా లేదు అనే విషయం తెలిసిందే, అయితే ఏపీలో అధికారంలో  ఉంది వైసీపీ… అయితే వైయస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ కూడా పెడుతున్నారు,  ఈ సమయంలో తెలంగాణలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
తెలంగాణ వైసిపి అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి గట్టు శ్రీకాంత్రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖని ఏపీ సీఎం జగన్ కు ఆయన పంపించారు.
ఇక ఏపీ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలో వైసిపిని విస్తరించే ఆలోచన లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు  శ్రీకాంత్రెడ్డి  ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యారు, అయితే అందరూ కూడా ఇక వైయస్ షర్మిల కొత్త పార్టీలో ఆయన చేరుతారు అని భావించారు.
కాని ఆయన   భవిష్యత్తులో జాతీయ పార్టీ తరఫునే హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానని తెలిపారు, దీంతో ఇక ఆయన బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరుతారు అనేది అర్దం అవుతోంది, ఆయన త్వరలోనే జాతీయ పార్టీలో చేరనున్నారట..
ఇక వైయస్ షర్మిల కొత్తపార్టీని ఆహ్వనిస్తున్నా ఆమెతో ఎలాంటి విభేదాలు లేవని  బెస్టాఫ్ లక్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Phone Tapping Case | తిరుపతన్న బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ..

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) తెలంగాణ అంతటా తీవ్ర దుమారం...

Serial Killer | సికింద్రాబాద్ లో సీరియల్ కిల్లర్ అరెస్ట్..

ట్రైన్లో ప్రయాణం చేస్తూ హత్యలు, దోపిడీలు, అత్యాచారలకు పాల్పడుతున్న ఓ సీరియల్...