భార్యతో కలిసి గుంటూరులో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

-

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని భారత్పేటలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. తన భార్య వైఎస్ భారతితో కలిసి ఆయన ఇక్కడకు వచ్చారు. ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభించారు… ఇక్కడ  రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సిన్ వేసే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో కేవలం మూడు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఇక గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామాల్లో
ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తాము అని తెలిపారు…. ఇక గ్రామాల్లో ప్రతీ ఇంటికి వెళ్లి  45 ఏళ్లు దాటినవారి వివరాలను తీసుకుంటారని చెప్పారు.
 ప్రజలకు ఏయే రోజు వ్యాక్సిన్ వేస్తారు? ఎప్పుడు వెళ్లాలనే అంశాలను వివరించి చెబుతారని అన్నారు, ప్రతీ మండలంలోని
పీహెచ్ సీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....