అమ్మాయిల చ‌దువు విషయంలో తాలిబ‌న్లు మ‌రో కొత్త రూల్

The Taliban have another new rule when it comes to girls' education

0
238

తాలిబ‌న్లు ఇక పాత ప‌ద్ద‌తులు ఉండ‌వు అంద‌రూ సంతోషంగా ఉండ‌వ‌చ్చు ఎవ‌రికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు అని శాంతి వ‌చ‌నాలు చెబుతూనే, కొత్త నియ‌మాలు ఆంక్ష‌లు నిబంధ‌న‌లు పెడుతున్నారు. దీంతో అక్క‌డ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో రోజుకో కొత్త రూల్ వినిపిస్తోంది.
మళ్లీ తమ అరాచక పాలన ప్రారంభిస్తున్నట్లే కనిపిస్తోంది.

విద్యా వ్యవస్థపై తాలిబన్లు ఆంక్షలు విధించడం స్టార్ట్ చేశారు. ఇప్ప‌టికే చాలా మంది మ‌హిళ‌లు ఉద్యోగాల‌కు వెళ్ల‌డం లేదు. కొన్ని కంపెనీలు మ‌హిళ‌ల‌కు ఉద్యోగం ఇవ్వ‌డం లేదు.
హెరాత్ ప్రావిన్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకునే కో-ఎడ్యుకేషన్ విధానాన్ని రద్దు చేశారు. ఇలా రోజుకో కొత్త చ‌ట్టం తీసుకువ‌స్తున్నారు.

తాజాగా మ‌రో కొత్త రూల్ తెచ్చారు. విద్యా సంస్థల్లో ఎక్కడా ఆడపిల్లలకు మగ టీచర్లు చదువు చెప్పకూడదని తాలిబన్లు కొత్త రూల్ తెచ్చారు. కో-ఎడ్యుకేషన్ విధానాన్ని కూడా దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్క‌డ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియామకం జరిగిన మరుసటి రోజే హక్కానీ
ఈ కొత్త ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో అక్క‌డ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దీని వ‌ల్ల బాలిక‌లు విద్య‌కి మ‌రింత దూరం అవుతారు అని విద్యావేత్త‌లు అంటున్నారు.