ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది.. అమ్మ ఒడి ద్వారా లక్షలాది మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ అయింది, అయితే రానున్న 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మ ఒడి లబ్దిదారులైన మహిళలు కోరుకుంటే, 9 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న విద్యార్థులకు నగదు బదులుగా ల్యాప్ టాప్ లను ఇస్తాము అని గతంలోనే తెలిపారు.
తాజాగా దీనిపై తల్లిదండ్రులకి లేఖలు రాశారు… ఈ ల్యాప్ టాప్ లలో డ్యూయల్ కోర్ కు సమానమైన ప్రాసెసర్ తో పాటు 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్ ఉంటుందని, మార్కెట్లో దీని విలువ రూ. 25 వేల నుంచి రూ. 27 వేల వరకూ ఉంటుందని మూడు సంవత్సరాల వారంటీ ఉంటుంది ఏదైనా సమస్య వస్తే సచివాలయం ద్వారా దానిని రిపేర్ చేయించే సిస్టం ఉంటుంది.
ఇక ఏడు రోజుల్లో రీప్లేస్ లేదా బాగుచేసి ఇస్తారు.. ఇక ఈ లేఖలు తల్లిదండ్రులకి రాశారు, వారు నగదు కావాలి అంటే నగదు లేదా ల్యాప్ అంటే ల్యాప్ టాప్ ఇవ్వనున్నారు.. ఏప్రిల్ 10లోపు లేఖలను తల్లులకు పంపాలని, తిరిగి సమాధానంతో కూడిన లేఖలను 22వ తేదీలోగా స్కూల్ ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులకు అందించాలని అధికారులు ఆదేశించారు.
ఇలా ల్యాప్ టాప్ ఉంటే ఆన్ లైన్ లో పాఠాలను వినవచ్చని, చదువుకు సంబంధించిన వీడియోలను చూడటంతో పాటు, డిజిటల్ బుక్స్ చదువుకోవచ్చని తెలిపారు. హానికర వెబ్ సైట్ల నిరోధానికి, ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసి వీటిలో ఇస్తారు, దీని వల్ల పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.