చిక్కుల్లో జగన్

చిక్కుల్లో జగన్

0
392

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లిష్ట పరిస్థితిలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే…

అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ మర్డర్ పై సిట్ వేయించారు. ఆ తర్వాత ఏపీలో ఎన్నికలు జరిగాయి… జగన్ మోహన్ రెడ్డి అఘండవిజయం సాధించి ముఖ్యమంత్రి పిఠాన్ని అధిష్టించారు. దీంతో వైఎస్ వివేకాను ఎవరు మర్డర్ చేశారు వేంటనే తెలుస్తుందని అందరు అభవించారు.

 కానీ ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇప్పటివరకు ఈ మర్డర్ పై 5 సిట్ లు వేశారు. కానీ ప్రయోజనం లేదు. ఇక దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంలో తన బాబాయ్ ను హత్య చేయించారని అరోపిస్తున్నాయి.

హ్యత జరిగి ఇన్నినెలలు కావొస్తూన్నా ఇంతవరకు నిజాలు బయటికి రాలేదని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ఈకేసులో ఉన్నారని అందుకే ఈ కేసు ఎటు తేల్చలేకపోతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు.

మరోవైపు జగన్ ఫ్యామిలీ కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం చేయకపోవడం ఏంటి అని ప్రశ్నలు వస్తున్నాయట.