బంగారం ధర భారీగా తగ్గుదల రెండు రోజులుగా నమోదు చేసింది.. ఇప్పుడు మళ్లీ పెరిగింది… అయితే బంగారం కొనాలి అని చూసే వారికి కాస్త బ్యాడ్ న్యూస్… ఈ రోజు పుత్తడి ధరలు కొంచెం పెరిగాయి. మరి బంగారం ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్లో అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.46,250కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది రూ.140 పెరుగుదలతో రూ.42,400కు
చేరింది..వెండి రేటు ఈ రోజు పెరుగుదల తగ్గుదల నమోదు చేయలేదు సాధారణంగానే ఉంది.
దీంతో కేజీ వెండి ధర రూ.69,300 దగ్గర ట్రేడ్ అవుతోంది బంగారం వెండి వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 11 వేల వరకూ తగ్గింది బంగారం ధర …మరి వచ్చే రోజుల్లో బంగారం
వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.