ప్రజావేదికను కూల్చడం సరైనది కాదు : చంద్రబాబు

ప్రజావేదికను కూల్చడం సరైనది కాదు : చంద్రబాబు

0
386

ప్రజావేదికను కూల్చి వేయాలనుకోవడం సరైన ఆలోచన కాదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విదేశీ పర్యట ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజావేదిక కూల్చివేతపై, టిడిపి శ్రేణులపై జరిగి దాడుల గురించి చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించారు. ఈ సందర్భంగానే చంద్రబాబు పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.