బ్రేకింగ్ -భారీగా పెరిగిన వెండి ధర 4800 – మరి బంగారం రేట్లు ఇవే

బ్రేకింగ్ -భారీగా పెరిగిన వెండి ధర 4800 - మరి బంగారం రేట్లు ఇవే

0
439

బంగారం ధర రెండు రోజులు తగ్గితే, మరో రెండు రోజులు పరుగులు పెడుతోంది.. ఇలా బంగారం ధర మార్కెట్లో అప్ అండ్ డౌన్ లో కొనసాగుతోంది.. ఒకేసారి 1600 తగ్గిన పసిడి మళ్లీ రెండు రోజుల్లో పరుగులు పెట్టింది, ఇలా మార్కెట్లో కొనసాగుతున్న వేళ వెండి మాత్రం ఒకేసారి నేడు షాక్ ఇచ్చింది.

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.20 తగ్గింది. రూ.52,030కు ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేవలం రూ.10 తగ్గుదలతో రూ.47,700కు చేరి ట్రేడ్ అవుతోంది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. ఏకంగా రూ.4800 పెరుగుదలతో వెండి ధర రూ.68,400కు చేరింది.
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయా తగ్గుతాయా అంటే వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి కాని పెరిగే అవకాశం లేదు అంటున్నారు బులియన్ వ్యాపారులు, ముఖ్యంగా షేర్ మార్కెట్ పరుగులు పెడుతోంది ఇదే ప్రధాన కారణం.