రాష్ట్ర రుణ ప్రణాళిక ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌..!!

రాష్ట్ర రుణ ప్రణాళిక ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌..!!

0
414

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ) జరిగింది. ఈ సందర్భంగా 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళిక (బ్యాంకింగ్)ను సీఎం ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చాక జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా కసరత్తు చేశారు.

వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం బ్యాంకులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, కన్నబాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు ఎస్.దాస్ పాల్గొన్నారు.