చాలా మంది హెల్మెట్ లేకుండా ఇంకా ప్రయాణాలు చేస్తున్నారు… ఏదైనా ప్రమాదాలు జరిగితే గాయాలపాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు, అయితే పోలీసులు ఎన్నో సార్లు హెచ్చరిస్తున్నా కొందరు లెక్క చేయడం లేదు, ఇక నామమాత్రంగా వంద రూపాయల ఫైన్ అంతేకదా అని కొందరు చలాన్లు కట్టుకుంటున్నారు.. మార్పు మాత్రం కొందరిలో రావడం లేదు.
ఇక ఇలాంటి వారికి చుక్కలే, తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరితం కఠినతరం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ఇక ఫైన్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు…ఇక హెల్మెట్ లేకుండా ఎవరైనా బైక్ నడుపుతూ కనిపిస్తే వెంటనే వారి డ్రైవింగ్ లైసెన్స్ కాన్సిల్ చేస్తారు.
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్
రద్దు చేస్తారు..తొలిసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే మూడు నెలలు రెండోసారి పట్టుబడితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తారు. ఇక బండిపై ప్రయాణం చేసే ఇద్దరూ కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే.
వీడియో చూడండి
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.#RoadSafety #RoadSafetyCyberabad@cyberabadpolice @TelanganaCOPs pic.twitter.com/AWbxWDLTZM
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 19, 2021