1.7 లక్షల కోట్ల సామ్రాజ్యానికి ఆమె ఇప్పుడు రాణి

1.7 లక్షల కోట్ల సామ్రాజ్యానికి ఆమె ఇప్పుడు రాణి

0
119

వ్యాపారస్తుల కుటుంబాల్లో వారి తర్వాత వారి వారసులే ఆ కంపెనీల వ్యాపారాల బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు, లక్షల కోట్ల టర్నోవర్ కంపెనీలు వారి చేతుల్లోకి వస్తాయి, అయితే ఇలా తాజాగా ఓ కంపెనీ అధినేత ఇప్పటి వరకూ తను చేసిన పనిని తన కుమార్తెకి అప్పగించారు, ఆమె బాధ్యతగా తీసుకుంటున్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త, హెచ్సీఎల్ టెక్ ఫౌండర్ శివ్ నాడార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కూతురికి కంపెనీ పగ్గాలు అప్పగించారు.ఆయన కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా ఇక ఆ బాధ్యత తీసుకోనున్నారు.

మన దేశంలోని అత్యంత మహిళా సంపన్నురాలు ఇక ఆమెనే. ఇక శివ్ నాడార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారు. సీనియర్ గా అడ్వైస్ లు ఇస్తారు..హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్ గా ఆయన ఉన్నారు, ఇక మన దేశంలో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఇది కూడా ఒకటి.హెచ్సీఎల్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.1.7 లక్షల కోట్లుగా ఉంది. ఆమెకి అందరూ అభినందనలు తెలియచేస్తున్నారు.