యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు..స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం ప్రకటన

0
89

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.  10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. ఇది చారిత్రాత్మకమైన రోజని.. చారిత్రాత్మక ప్రదేశం నుండి ముఖ్యమంత్రి యువత భవిష్యత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేశారన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.