10 లక్షల పెన్షన్లు..భారీగా ఉద్యోగాల భర్తీ..కేబినెట్​లో కీలక నిర్ణయాలు

0
104

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలోమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 21వ తేదీన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాల రద్దుతో పాటు ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది.

ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న 36 లక్షల మందితో పాటు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది. మెుత్తం కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు జారీ చేయనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 వేల 111 అంగన్‌ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినేట్‌ పేర్కొంది. ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని పేర్కొంది.

వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేసింది. జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినేట్‌ ఆదేశించింది. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఓ కమిటీ వేసింది.