పిల్లిని కాపాడి 10 లక్షలు రివార్డు – వీరికి అదృష్టం తెచ్చిన పిల్లి – వీడియో వైరల్

10 lakh reward for saving a cat

0
113

ఎప్పుడు అదృష్టదేవత ఎవరిని ఎలా పలకరిస్తుందో చెప్పలేము. ఒక్కోసారి లాటరీలు గెలుచుకుని కోట్ల రూపాయిలు సంపాదించుకున్న వారు ఉంటారు. మరికొందరికి ఊహించని విధంగా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా వీరికి మాత్రం పిల్లి రూపంలో అదృష్టం వచ్చింది. ఆ పిల్లే వారికి 10 లక్షల రివార్డు వచ్చేలా చేసింది. ఇంతకీ పిల్లి వీరికి పది లక్షలు వచ్చేలా ఎలా చేసిందా అంటే ఇది తెలుసుకోవాల్సిందే.

దుబాయ్ లో గర్భంతో ఉన్న ఓ పిల్లి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోతుండగా, ఓ నలుగురు వ్యక్తులు దాన్ని కింద దుప్పటిలాంటిది వేసి అది నేలపై పడకుండా పట్టుకున్నారు. ఇదంతా వీడియో తీశారు అక్కడ ఉన్నవారు. దీంతో ఆ పిల్లి ప్రాణాలు ఇలా కాపాడారు నలుగురు .ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బీప్ రషీద్ ఈ వీడియో చూశారు. వెంటనే రాజు రషీద్ స్పందించారు గర్భంతో ఉన్న పిల్లి ప్రాణాలు కాపాడిన వారిని మెచ్చుకుంటూ 10 లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు. వారిలో ఒకరు కేరళ వాసి అష్రఫ్ కూడా ఉన్నారు. ఆ గర్భంతో ఉన్న పిల్లిని కాపాడిన వారిని స్థానికులు మెచ్చుకున్నారు. ఇక వీరి నలుగురికి ఒకరికి ఒకరు అస్సలు తెలియదు. మానవత్వంతో కాపాడారు ఈ వీడియో మీరు చూడండి.

https://twitter.com/HHShkMohd/status/1430229698706034695