13 జిల్లాలకు కొత్తగా ఏం రానున్నాయో చూడండి జగన్ కొత్త ప్లాన్

13 జిల్లాలకు కొత్తగా ఏం రానున్నాయో చూడండి జగన్ కొత్త ప్లాన్

0
76

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు చోట్ల రాజధాని ఉండచ్చు అని చెప్పడంతో, ఏపీలో పలు రాజకీయ పార్టీలు విమర్శలు ఆరోపణలు చేస్తున్నాయి.. అయితే డవలప్ మెంట్ వికేంద్రీకరణ ఉండాలి కాని పరిపాలన వికేంద్రీకరణ వద్దు అంటున్నారు.. కాని అన్ని ప్రాంతాలు డవలప్ అవ్వాలి అంటే కచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే అని మరికొందరు అంటున్నారు.

అయితే తాజాగా 13 జిల్లాల్లో ఏమి ఏమి రానున్నాయి అనే విషయంలో, చూస్తే జిల్లాల్లో కూడా పెద్ద పెద్ద సంస్దలు అలాగే డవలప్ మెంట్ కు ఆయా రంగాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు అవ్వనున్నాయి అని తెలుస్తోంది. ..మరి ఏఏ జిల్లాలో ఏ డవపల్ మెంట్ అలాగే ప్రాజెక్ట్ వస్తుందో చూద్దాం.

శ్రీకాకుళంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్,
విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్ట్,
విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్,
తూర్పుగోదావరిలో పెట్రో సెజ్,
పశ్చిమగోదావరిలో పోలవరం ప్రాజెక్ట్,
కృష్ణా జిల్లాలో బందర్ పోర్టు,
గుంటూరు జిల్లాలో అసెంబ్లీ,
ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్ట్,
నెల్లూరు-చిత్తూరు జిల్లాల్లో బీహెచ్ఈఎల్ ఏర్పాటు,
అనంతపురంలో రాడార్ యూనిట్,
కర్నూలులో హైకోర్టు,
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ

వీటిని ఏర్పాటు నిర్మాణం చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా.. ప్రతి జిల్లాను అభివృద్ధిపథంలో నడపొచ్చని సీఎం జగన్ భావిస్తున్నారట. తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన ఉంటుందంటున్నారు. సో అది జగన్ ప్లాన్ అంటున్నారు మేధావి వర్గం.