తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు..లిస్ట్ ఇదే

0
81

తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 607 మండలాలు ఉండగా.. కొత్తగా చేర్చిన వాటితో ఆ సంఖ్య 620కు చేరింది. అయితే దీనికి సంబంధించి గతంలోనే నోటిఫికేషన్ జారీ చేయగా..అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. అనంతరం కొత్త మండలాల లిస్ట్ రిలీజ్ చేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు ఇవే..

మహబూబాబాద్ జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి

నల్గొండ జిల్లాలో గట్టుప్పల్

సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్

జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం

సిద్దిపేట జిల్లాలో అక్బర్ పెట్, భీంపల్లి, కుకునూరుపల్లి

కామారెడ్డి జిల్లాలో డొంగ్లి

మహబూబ్నగర్ కౌకుంట్ల

నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా