176 మంది చనిపోయిన విమానం కూల్చింది మేమే ప్రకటించిన ఆ దేశం

176 మంది చనిపోయిన విమానం కూల్చింది మేమే ప్రకటించిన ఆ దేశం

0
86

దారుణం ఉన్మాదం అంతా ఇప్పుడు ఇరాన్ ఇరాక్ అమెరికా చుట్టు వినిపిస్తున్న మాటలు ..వరల్డ్ వార్ కు సిద్దం అయ్యేలా వీరి మాటలు ప్రకటనలు ఉంటున్నాయి.. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలి, పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 176 మంది దుర్మరణం పాలయ్యారు. విషాదకరమైన ఘటన అనే చెప్పాలి.

ఇరాన్, అమెరికా దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తించింది. విమానాన్ని కూల్చింది ఎవరు అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఈ విమానం తామే కూల్చాము అని ఒప్పుకుంది ఇరాన్.
ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని అక్కడ మంత్రి తెలిపారు. కేవలం మానవ తప్పిదంగానే దీన్ని పరిగణించాలని కోరారు. అమెరికా దుందుడుకు చర్యలే ఈ ఘటనకు దారి తీశాయని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నాం అన్నారు

ఈ విమానం కూలిన సమయంలో ఇరాన్ దీనిని కూల్చింది అని అమెరికా చెప్పింది. కాని ఇరాన్ ఖండించింది. కానీ, ఇరానే విమానాన్ని కూల్చిందంటూ అమెరికా, కెనడా ఇంటెలిజెన్స్ విభాగాలు 24 గంటల్లోనే ప్రకటించాయి. వీరు ఎంత దారుణంగా ప్రవర్తించారు అనేది అక్కడ జ