ఈ రోజుల్లో ఒక పెళ్లి అవ్వక చాలా మంది బాధపడుతున్నారు, కాని కొందరు ఏకంగా మాయ మాటలు చెప్పి ఏకంగా నాలుగు ఐదు వివాహాలు చేసుకుంటున్నారు, ఏమీ లేని ఉద్యోగాలు ఆస్తులు ఉన్నాయి అని బురిడీ కొట్టించి చివరకు వారిని నట్టేట ముంచుతున్నారు… ఇక అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కొందరు ఇలాంటి వారు ఇటీవల బయటపడుతున్నారు..నవ వధువు అనే ట్యాగ్ లైన్ తో ఏకంగా 18 మందిని ముంచేసింది ఓ కిలాడి.
యువకులకు గాలం వేసి పెళ్లాడడం, ఆపై నగదు, నగలతో పరారు కావడం.. భాగ్వతి అలియాస్ అంజలి, ఈమెకి పెళ్లి అంటే చాలా సరదా ఈజీగా అందరిని మోసం చేస్తోంది దాదాపు ఇలా 18 మంది యువకుల జీవితాలను నాశనం చేసింది, చివరకు రాజస్ధాన్ లో అడ్డంగా బుక్కైంది. చివరకు ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు చెందినట్టుగా భావిస్తున్న అంజలి మరో ఐదుగురితో కలిసి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో పలువురిని మోసగించింది. ఇటీవల ఓ యువకుడిని వివాహం చేసుకుని మూడు లక్షల నగదుతో పారిపోయింది, దీంతో వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు, ఆమెని చివరకు వల పన్ని పట్టుకున్నారు పోలీసులు.
ReplyForward
|