2000 నోటుపై మరో సంచలన నిర్ణయం మార్చిలో డేంజర్ బెల్ మోగుద్దా

2000 నోటుపై మరో సంచలన నిర్ణయం మార్చిలో డేంజర్ బెల్ మోగుద్దా

0
83

ఇప్పుడు ఎక్కడ చూసినా నలుగురు చర్చించుకునే మాట రెండు వేల నోట్లు ఉంటాయా రద్దు అవుతాయా అని.. అందుకే తాజాగా ఈ విషయం గురించే అందరూ చర్చించుకుంటున్నారు.. అయితే దీనికి కారణం కూడా ఉంది.. కొన్ని బ్యాంకులు ఏటీ ఎంలలో 2000 నోట్లు పెట్టడం లేదు.. కేవలం 100 లేదా 500 అలాగే 200 నోట్లు మాత్రమే పెడుతున్నారు.. దీంతో చాలా వరకూ పెద్ద నోట్లు కనిపించడం లేదు, ఇక బ్యాంకుల్లో కూడా ఇలాంటి పరిస్దితి ఉంది.

ఇండియన్ బ్యాంక్ అయితే మార్చి 1 నుంచి తమ ఏటీఎంల్లో రూ.2,000 నోట్లను పూర్తిగా ఆపేస్తున్నట్టు ప్రకటించింది. మిగతా బ్యాంకులూ ఇందుకు సిద్ధమవుతున్నాయి.పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016లో ప్రవేశ పెట్టిన రూ.2,000 నోట్ల ముద్రణ ఇప్పటికే ఆగిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు ఒక్క రూ.2,000 నోటును కూడా ముద్రించలేదు…అందుకే పేద మధ్య తరగతి వారు ఈరెండు వేల నోటుని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి అని ఓ మెసేజ్ కూడా వైరల్ అవుతోంది.

పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అవడంతో కొన్ని చోట్ల బ్యాంకుల నుంచి రెండు వేల నోట్లు ఇచ్చినా పెద్ద మొత్తంలో ఇస్తే ఎవరూ తీసుకోవడం లేదు.. కేవలం 500 నోట్లు మాత్రమే కావాలి అంటున్నారు, అయితే కేంద్రం మాత్రం ఇవన్నీ ఫేక్ న్యూస్ రెండు వేల నోట్లు రద్దు జరగదు అని చెబుతోంది.