బిగ్ బ్రేకింగ్… 2000 నోట్లు బంద్…..

బిగ్ బ్రేకింగ్... 2000 నోట్లు బంద్.....

0
85

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గతంలో 500, 1000 రూపాయల వంటి పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత రెండువేల రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు… అయితే ప్రస్తుతం తాజా పరిస్థితులను చూస్తుంటే రెండువేల నోటు పై కూడా పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

అందుకే గత ఏడాది చివరి నుంచి రెండువేల రూపాయల నోట్లను ముద్రించడం నిలిపివేశాయని ఆర్ బీఐ ప్రకటించింది… దీంతో రెండువేల నోట్లు తగ్గాయి… విత్ డ్రా చేసుకుంటే ఎక్కువ శాతం కేవలం ఐదువందల నోట్లు మాత్రమే ఏటీఎంలనుంచి వస్తున్నాయి…

ఆర్బీఐ సూచనల మేరకు దాదాపు అన్ని ఎటీఎంలలో రెండువేల నోట్లు ఉండే క్యాసెట్లను తొలగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. మనీ ల్యాడరింగ్ లో పెద్ద నోట్లు ఎక్కువగా వాడుతున్నట్లు కేంద్రం భావిస్తోంది… అందుకే దశల వారిగా పెద్ద నోట్లను కూడా ఉపసంహరించే యోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…