2019 ఆగస్టులో కరోనా పుట్టుక వెలుగులోకి షాకింగ్ విషయాలు

2019 ఆగస్టులో కరోనా పుట్టుక వెలుగులోకి షాకింగ్ విషయాలు

0
87

ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ గత ఏడాది డిసెంబరులో వెలుగులోకి వచ్చింది అని చైనా చెబుతోంది, కాని హువాన్ సీ ఫుడ్ మార్కెట్లో కరోనాను గుర్తించిన సమయం కంటే ముందే ఈ వైరస్ వ్యాప్తి మొదలైందన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది,
హార్వర్డ్ మెడికల్ స్కూలు ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది.

గతేడాది 2019 ఆగస్టులోనే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందని అంటున్నారు, ఆ సమయంలో వుహాన్ నగరంలోని ఆసుపత్రుల్లో విపరీతమైన రద్దీ కనిపించిందని వివరించింది రీసెర్చ్ .చైనాలోని ఆసుపత్రుల పార్కింగ్ ప్లేసులు కూడా జనాలతో నిండిపోయాయని తెలిపింది. కొన్ని శాటిలైట్ చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నామని హార్వర్డ్ పరిశోధకులు వెల్లడించారు.

దీని ప్రకారం చూస్తే ఆ సమయంలో చాలా మంది ఆస్పత్రులకి చేరుకున్నారు…ఈ చిత్రాలు చూస్తే పార్కింగులో కూడా వాహనాలు వందల్లో ఉన్నాయి, అంతేకాకుండా అందరూ దగ్గు జలుబు గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు ఇంటర్ నెట్ లో , ఇవన్నీ చూస్తుంటే ఆగస్టు నుంచి ఈ వైరస్ అక్కడ ప్రబలింది అంటున్నారు పరిశోధకులు.