ఈ ఏడాది 2021 ధనస్సురాశి రాశి ఫలాలు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం.. ఈ రాశి వారికి ఈ ఏడాది అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి.. శని బృహస్పతి ద్వారా మంచి జరుగుతుంది.. కొత్త ఇంటి నిర్మాణం చేస్తారు లేదా కొత్త స్ధలం కొనుగోలు చేస్తారు, బ్యాంకులో నగదు నిల్వ ఈ ఏడాది మీకు పెరుగుతుంది.జనవరి నుంచి మీకు విదేశీ యానం ఆగస్టు వరకూ కనిపిస్తోంది.
అమ్మాయిలు ఎన్నారై వరుడ్ని పెళ్లి చేసుకుంటారు.. ఇక పెళ్లి కోసం చూస్తున్న వారికి ఈ ఏడాది మంచి న్యూస్ వినిపిస్తుంది.. ఇంట్లో శుభకార్యాలు మే తర్వాత జరుగనున్నాయి… సంతానం కోసం చూస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.
గుడ్ న్యూస్ ఏమిటి అంటే మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే మీరు మీ డబ్బును తిరిగి పొందుతారు.
సోదరులు అక్క చెల్లెల్ల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి…ప్రేమ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి
ఇక తల్లిదండ్రులని ఎదిరించి వివాహాలు చేసుకునే పరిస్దితి కొందరికి కనిపిస్తోంది..మీరు ఉద్యోగ బదిలీ గురించి ఆలోచిస్తున్నట్లయితే మే – ఆగస్టు నెలలు బాగున్నాయి.దాదాపు నాలుగు సంవత్సరాలుగా వివాహాల కోసం చూస్తున్న వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి.