20 మిలియన్ పిల్లలకు అందని వ్యాక్సిన్

20 మిలియన్ పిల్లలకు అందని వ్యాక్సిన్

0
111

నివారించగల వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి ఇచ్చే వ్యాక్సిన్లు గత ఏడాది 20 మిలియన్ పిల్లలకు పూర్తిగా అందలేదు.. గత ఏడాది 19.4 మిలియన్ పిల్లలకు వ్యాక్సిన్ అందలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ తమ వార్షిక నివేదికలో తెలిపింది… అదే విధంగా 2017 లో 18.7 మిలియన్ పిల్లలకు వ్యాక్సిన్ అందకపోవడం గమనార్హం…

యుద్దవాతావరణం అసమానతల కారణంగా ప్రపంచ వ్యాక్సిన్ రేటు స్తంభించింది ఇది ప్రమాదకరమని ఐఖ్యరాజ్యసమితి హెచ్చరించింది… శిశు జననాలు ఎలా ఉన్నయో సమాచారం లేకపోతే ప్రాణంతక వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ వినియోగంలో ఏమాత్రం పురోగతి కనిపించడంలేదని పేర్కొంది…

గత ఏడాది 3 లక్షల 50 వేల తట్టు వ్యాధి పొంగువ్యాధి కేసులు నమోదు కాగా 2017 నాటి సంఖ్యతో ఇది రెట్టింపు అని చెప్పవచ్చు… 2019 మొదటి క్వార్టర్ లో కేసుల సంఖ్య గత ఏడాది ఇదే క్వార్టర్ తో దాదాపు 300 రెట్లు ఎక్కువ అని తెలిపింది…