22 మంది అవినీతి అధికారులకు ఉద్యోగాల తొలగింపు

22 మంది అవినీతి అధికారులకు ఉద్యోగాల తొలగింపు

0
82

అవినీతి, తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 22 మంది పన్ను శాఖ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇదివరకు 12 మంది ఆదాయం పన్ను శాఖ అధికారులతో సహా మొత్తం 27 మంది ఇండియన్ రెవెన్యూ సర్వీసుకు చెందిన సీనియర్ అధికారులను ఆర్థిక మంత్రిత్వ శాఖ తొలగించింది.

అవినీతి అధికారులను ఉద్యోగాలలో కొనసాగనివ్వరాదన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ చర్యలు చేపట్టింది.

అవినీతి, అక్రమాలు, సిబిఐ దాడులు తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్న 22 మంది సూపరింటెండెంట్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ర్యాంకులో ఉన్న 22 మంది సీనియర్ అధికారులను తప్పనిసరిగా పదవీ విరమణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సిబిఐసి) నిర్ణయించినట్లు ఆ శాఖ ప్రకటించింది.