24 గంటలు గ్రామం ఖాళీ చేసి అడవిలోకి వెళ్లిపోతారు – వింత ఆచారం యువత ఏం చేస్తారంటే

-

మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు ప్రజలు… ముఖ్యంగా గ్రామాల్లో ఇలాంటి వింత ఆచారాలు పాటిస్తారు, తాజాగా ఇలాంటి ఆచారం గరించి చెప్పుకోవాలి…అనంతపురం జిల్లాలోని ఓ గ్రామం కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లి, ఇక్కడ గ్రామంలోని ప్రజలు 24 గంటలు గ్రామం ఖాళీ చేసి అడవిలోకి వెళ్లిపోతారు, అక్కడ ఓ రోజు ఉండి తర్వాత రోజు గ్రామంలోకి అడుగుపెడతారు.

- Advertisement -

ఇలా 24 గంటల పాటూ ఊరిని ఖాళీ చేస్తారు… గ్రామం చుట్టూ ముళ్లకంచె వేసి అందరూ పోలాలు అడవుల్లోకి వెళతారు..ముందుగానే ఆహార వస్తువులు అక్కడకు తీసుకువెళతారు… తాజాగా సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ ఇలా ఖాళీ చేశారు. ఇక్కడ మరో విచిత్రం దేవుడి ప్రతిమలతో పాటు పెంచుకున్న మూగజీవాలను వారితో తీసుకువెళ్లారు.

కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో అతిసార సోకి జనాలు చనిపోయారట. ఆ సమయంలో అక్కడ
గ్రామ దేవతలు పాలనాయక, పెద్దక్క రాయమ్మ అమ్మవారు అప్పట్లో అర్చకులు కలలో కనిపించి 24 గంటల పాటు అందరూ గ్రామాన్ని వదిలి వెళితే ఈ జబ్బు పోతుంది.. గ్రామానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు , నాటినుంచి దీనిని గ్రామస్తులు పాటిస్తున్నారు, అయితే ఇలా ప్రతీ 3 ఏళ్లకు దీనిని పాటిస్తున్నారు, ఇక ఊర్లో ఆ 24 గంటలు ఎవరికి ఎంట్రీ ఉండదు, దాదాపు అన్నీ దారుల్లో యువకులు కాపలా ఉంటారు, ఇలా ఎవరైనా దాటాలి అని ప్రయత్నిస్తే నాలుకపై కాలుస్తారట, ఇక తర్వాత రోజు గ్రామంలోకి వచ్చి శాంతి బలులు చేసి పసుపు కుంకుమ అన్నంలో కలిపి గ్రామం అంతా చల్లుతారు.. ఇది ఆ ఊరి వింత ఆచారం…దీనిని ఇప్పటి యువత కూడా పాటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...