డబ్బే డబ్బు : 25 సంపన్న కుటుంబాల సంపద రూ. 100 లక్షల కోట్లు

డబ్బే డబ్బు : 25 సంపన్న కుటుంబాల సంపద రూ. 100 లక్షల కోట్లు

0
91

డబ్బే లోకం…డబ్బే సర్వస్వం..అవును..డబ్బే పరమావధిగా బతికేస్తున్నారు కొందరు. కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తూ కుబేరులవుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనికులకు, పేదవారికి ఆర్థిక అంతరాలు గణనీయంగా పెరిగాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. 8 మంది అత్యధిక ధనికుల సంపద ప్రపంచంలోని సగం మది పేదల సంపదతో సమానంగా ఉందని ఇటీవలే ఆక్స్ ఫామ్ సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచ సంపన్న కుటుంబాల సంపద అధికమౌతూనే ఉంది.

నిమిషానికి రూ. 49.72 లక్షలు, గంటకు రూ. 28.41 కోట్లు..రోజుకు రూ. 714 కోట్లుగా ఉంది. సంపన్న కుటుంబాల్లో టాప్‌లో వాల్ మార్ట్ వ్యవస్థాకుడు వాల్టన్ వంశీయులు ఉన్నారు. వాల్టన్ల సంపద (జూన్ నుంచి చూస్తే) ఏకంగా 39 బిలియన్ డాలర్లకు ఎగబాకి 191 బిలియన్ డాలర్లకు చేరింది. ఇతర వ్యాపర, పారిశ్రామిక కుటుంబాల సంపద భారీగా పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది.

చాక్లెట్ల తయారీలో మార్స్ కుటుంబీకులున్నారు. వీరి సంపద 37 బిలియన్ డాలర్లు పెరిగి..127 బిలియన్ డాలర్లను తాకింది. సంపద సృష్టిలో అమెరికానే కాదని..తాము ఉన్నామని చూపిస్తుయి ఇతర రాష్ట్రాల వారు. ఆసియా, ఐరోపా దేశాల వంటి వారు అమెరికాకు పోటీనిస్తున్నారు.

ఓవైపు వీరి సంపద అధికమౌతుంటే..ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమౌతున్నాయి. పేద – ధనిక వర్గాల మధ్య ఈ అగాథం ఎప్పుడు తొలగిపోతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు భారతీయ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సంపద 7 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లను దాటింది.