భూమికి సమస్య ఉంటే భుక్తికి చిక్కొచ్చినట్లే. ప్రతి పల్లెలో వందల కుటుంబాలు భూహక్కుల చిక్కుల్లో చిక్కుకొని సతమతమవుతున్నాయి. భూమి ఉన్నా, పట్టా లేకనో, ‘ధరణి’కి ఎక్కకనో, నిషేధిత జాబితాలో చేరడం వలనో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సమస్య ఏమిటి, పరిష్కారం ఎలానో తెలియని గందరగోళంలో ఉన్నారు. వీరికి తగిన న్యాయ సలహాలు అందించడానికి ప్రముఖ భూచట్టాల న్యాయ నిపుణులు, న్యాయవాది, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు భూమి సునీల్, భారత సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పి. నిరూప్ రెడ్డి, తెలంగాణ తహశీల్దార్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రెవెన్యూ పత్రిక సంపాదకులు లచ్చిరెడ్డి గార్ల ఆధ్వర్యంలో ప్రతి శనివారం గ్రామాలలో “భూన్యాయ శిబిరాల”ను లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ ( లీఫ్స్) మరియు గ్రామీణ న్యాయ పీఠం సంస్థలు నిర్వహించబోతున్నాయి. ఈ శిబిరాల ద్వారా భూ సమస్యలు ఉన్న రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించనున్నారు.
ధరణి లేదా ఇతర భూమి సమస్యలు ఉన్న రైతులు భూన్యాయ శిబిరాలలో తమ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఈ భూన్యాయ శిబిరంలో భూమి చట్టాలు మరియు రెవిన్యూ నిపుణులు, న్యాయవాదులు, పాల్గొని రైతులకు సలహాలు అందిస్తారు. ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ ప్రాక్టీషనర్స్, ద రూరల్ లా ఫర్మ్ (LAP); తెలంగాణ రెవెన్యూ పత్రిక; తెలంగాణ సోషల్ మీడియా ఫోరమ్-TSMF సంస్థలు ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నాయి.
9 జులై 2022 నాడు ఉదయం 8 గంటలకు పెద్దవంగర మండలం, మహబూబాబాద్ జిల్లా, చిన్నవంగర గ్రామంలో రెండవ భూన్యాయ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. తెలంగాణ రైతాంగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ సమాజం ఈ కార్యక్రమానికి చేదోడుగా నిలవాలని కోరుతున్నాము. ఈ సమాచారాన్ని ప్రజలకు మీద్వారా చేరేలా చెయ్యాలని విజ్ఞప్తి చేస్తూ … ధన్యవాదాలతో…
జీ. జీవన్ రెడ్డి
ఉపాధ్యక్షులు
లీఫ్స్ సంస్థ
6305275697