ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానులు రావచ్చాని అన్నారు… విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూల్ జ్యుడీషియల్ క్యాపిటల్, అమరావతి లెజిస్లెటివ్ క్యాపిటల్ రావచ్చిని చెప్పారు…
దీంతో అమరావతి రైతులు రోడ్డెక్కారు… అమరావతిని రాజధానిగా ఉంచాలని డిమండ్ చేస్తున్నారు… మూడు రాజధానులు వద్దు అమరావతినే ముద్దు అని నినాదాలు చేస్తున్నారు… వీరికి టీడీపీ అలాగే జనసేన పార్టీలు కూడా మద్దతు పలికాయి… అయితే ఇదే జిల్లాకు చెందిన నందమూరి ఫ్యామిలీ మాత్రం స్పందించకుంది…
అయితే తాజాగా నందమూరి సుహాసిని స్పందించారు.. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని అన్నారు… మార్పు ఎవరి వల్ల సాధ్యం కాదని అన్నారు… గత ప్రభుత్వంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చని అన్నారు… ఏ రాష్ట్రానికి అయినా ఒక్కటే రాజధాని ఉంటుందని అన్నారు…