ఈ రోజుల్లో ఏమి ఐటెమ్స్ తినాలి అన్నా వెంటనే ఫుడ్ యాప్స్ ఓపెన్ చేయడం రెస్టారెంట్ ఓపెన్ చేసి మనకు నచ్చిన ఫుడ్ తెప్పించుకుంటున్నాం, ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు వ్యాపారులు యువత ఇదే చేస్తున్నారు, తక్కువ ధరకు ఎక్కడ ఫుడ్ బాగుంటే అక్కడ ఆర్డర్ చేస్తున్నారు… నేరుగా ఇంటికే వస్తోంది, అయితే ఆ నగరంలో ఉన్న సగానికి పైగా ఫుడ్ డెలివరీ బాయ్స్ అంతా ఆ ఇంటి వద్దే ఉన్నారు.
అందరూ ఒకేరకమైన ఫుడ్ తీసుకువచ్చారు, వారికే షాక్ అయింది.. ఒకే ఇంటిలో ఇన్ని ఆర్డర్లు రావడం ఏమిటి.. పోని ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అని ఇక అందరూ అనుకున్నారు, ఇక డెలివరీ బాయ్స్ అంతమంది ఆ ఇంటి బయట ఉండటంతో పక్కవారు షాక్ అయ్యారు.
ఫిలిపీన్స్లోని సెబు నగరానికి చెందిన బాలిక తన తల్లి కోసం చికెన్ కుల్లెట్లు ఆర్డర్ చేసింది. తాజాగా అలాగే ఒకటి ఆర్డర్ చేసింది, తీరా చూస్తే ఏకంగా 42 మంది ఇంటికి డెలివరీకి వచ్చారు, నేను ఒకటే ఆర్డర్ ఇచ్చాను అని ఆమె తెలిపింది, దీంతో ఎక్కడ సమస్య వచ్చిందా అని అందరూ షాక్ అయ్యారు.
అయితే ఆమె చేసిన సమయంలో ట్యాబ్ ఆప్షన్ చాలా సార్లు నొక్కింది.. దీంతో అన్నీ ఆర్డర్లు వచ్చేశాయి,
ఇక ఆ బాలిక క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడంతో ఒక్కదానికి మాత్రమే నగదు ఇచ్చింది.. మిగిలిన వారు రెస్టారెంట్ కు ఆఫుడ్ తీసుకుని వెళ్లిపోయారు.