48 గంటల్లో చింతమనేనికి మరోషాక్

48 గంటల్లో చింతమనేనికి మరోషాక్

0
89

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత సేపు చింతమనేని ప్రభాకర్ కు తిరుగు ఉండేది కాదు. కాని ఒక్కసారిగా ఓటమి పాలు అవ్వడంతో కేసులు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఇటీవలే ఆయన
ఈ నెల 16న బెయిల్పై విడుదలయ్యారు. అయితే విడుదల తర్వాత ఆయన జిల్లా జైలు నుంచి ర్యాలీగా దుగ్గిరాలలోని తన ఇంటికి చేరుకున్నారు.దీంతో ఇది మరో వివారం అయింది.

ఈ సమయంలో జిల్లాలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉండడంతో త్రీ టౌన్ సీఐ ఎంఆర్ఎల్ ఎస్ఎస్ మూర్తి తన సిబ్బందితో శనివారపు పేటలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి ర్యాలీలు చేయకూడదు. ముందు అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని, చింతమేననిపై ఏలూరుత్రీటౌన్ పోలీస్స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు.

అయితే విడుదల అయిన ఆనందం 48 గంటలు కూడా లేకుండా పోయింది అంటున్నారు ఆయన అభిమానులు.. చింతమనేని పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని, పోలీసు మోటారు వాహన చట్టాన్ని కూడా ఉల్లంఘించారని కేసు లో పేర్కొన్నారు. ఇక చంద్రబాబు కూడా చింతమనేనిని పరామర్శించారు, అయితే తనపై ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఎదురుకుంటా అంటున్నారు చింతమనేని.