5 కోట్ల ఉద్యోగాలు పోతాయ్ , ఎక్క‌డ ఎక్క‌డ లాస్ అంటే

5 కోట్ల ఉద్యోగాలు పోతాయ్ , ఎక్క‌డ ఎక్క‌డ లాస్ అంటే

0
81

క‌రోనా వైర‌స్ దాదాపు 200 దేశాల‌పై ప్ర‌భావం చూపిస్తోంది, అంతేకాదు ఈ వైర‌స్ దాటికి దాదాపు 35 వేల మంది ప్రాణాలు కోల్పోయారు… స‌రిగ్గా 80 దేశాలు పూర్తిగా లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి.. 150 దేశాలు దారుణ‌మైన స్దితిలో ఉన్నాయి… అయితే ఈ స‌మ‌యంలో వ్యాపారాలే కాదు ఉద్యోగాలు కూడా చాలా వ‌ర‌కూ క‌ష్టం అంటున్నారు.

కొత్త ఉద్యోగాల మాట ఎలా ఉన్నా, ఉన్నా ఉద్యోగాలు ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలియ‌ని ప‌రిస్దితి
తాజాగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ వెల్లడించిన అంచనాలు భయాందోళనలను కలిగించేలా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో రెండో త్రైమాసికంలో నిరుద్యోగం 32.1 శాతానికి పెరుగుతుందని తెలిపింది. మొత్తం 4.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పింది.

ఇది అత్యంత దారుణ‌మైన స్దితి అని అమెరికాలో చెబుతున్నారు.. ఇక 1948 త‌ర్వాత ఇదే అత్యంత దారుణ‌మైన స్దితి అని అధికారులు లెక్కిస్తున్నారు. 33 లక్షల మంది ప్రజలు నిరుద్యోగ లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.రెస్టారెంట్లు, హోట‌ల్స్, ఇంజ‌నీర్లు ఎక్కువ‌గా ఉద్యోగాలు కోల్పోతారు అని తెలిపింది.