3000 కోసం చూసిన చార్టెడ్ అకౌంటెంట్ కి 6 లక్షలు టోపీ పెట్టారు – జర జాగ్రత్త

-

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు చిన్న సందు దొరికినా దాని నుంచి మనల్ని మస్కా కొట్టిస్తున్నారు..
చార్టెట్ అకౌంటెంట్ అయిన వ్యక్తి ఏకంగా ఆరు లక్షల రూపాయలు కోల్పోయాడు. పాత సైకిల్ ను అమ్మడానికి ఓ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లో మూడు వేలు ధర పెట్టాడు, ఈ సమయంలో ఓ కస్టమర్ కాల్ చేసి సైకిల్ తీసుకుంటాను అన్నాడు చివరకు మూడు వేలకు ఇద్దరూ మాట్లాడుకున్నారు.

- Advertisement -

ఆ తర్వాత ముందురెండు వేలు క్యాష్ పంపిస్తాను మిగిలింది సైకిల్ తీసుకున్న సమయంలొ ఇస్తాను అన్నాడు, వెంటనే ఆ అకౌంటెంట్ ఒకే అన్నాడు, అయితే ఆ అవతల వ్యక్తి మీ వాట్సాప్ నెంబర్ కు ఓ క్యూ ఆర్ కోడ్ పంపించాను మీరు దానిని స్కాన్ చేస్తే మీకు 2000 వస్తాయి అన్నాడు.

అతను వెంటనే స్కాన్ చేశాడు కాని రెండు వేలు కాదు రెండు లక్షలు కట్ అయ్యాయి, ఫోన్ చేసి అడిగితే ఏదో రాంగ్ అయింది మరో కోడ్ పంపిస్తా చూడండి మీకు మొత్తం వస్తుంది అన్నాడు.. ఇలా మళ్లీ మరో రెండు లక్షలు కట్ అయ్యాయి, ఇక మూడోసారి సేమ్ సీన్ , ఇలా ఆరు లక్షలు పోయాయి, ఇక నాల్గోసారి కాల్ చేస్తే అతని ఫోన్ స్విచ్చాఫ్ అయింది.. వెంటనే మోసపోయాను అని గ్రహించి పోలీసులకి ఫిర్యాదు చేశాడు, అందుకే ఇలాంటి తెలియని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయద్దు, తెలియని వారికి అకౌంట్ నెంబర్లు ఇవ్వద్దు అంటున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

AP Assembly | మొదలైన ఏపీ అసెంబ్లీ.. జగన్ @ 11 నిమిషాలే..!

AP Assembly | ఏపీ బడ్జెట్ 2025 - 26 సమావేశాలు...

SLBC రెస్క్యూ కోసం రంగంలోకి రాట్ హోల్ మైనర్స్

శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు....