65 ల‌క్ష‌ల మందికి కరోనా హెచ్చ‌రిస్తున్న రిపోర్టులు

65 ల‌క్ష‌ల మందికి కరోనా హెచ్చ‌రిస్తున్న రిపోర్టులు

0
68

మ‌న దేశంలో కూడా క‌రోనా బాగా వ్యాపిస్తోంది.. కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు దీనిని అరిక‌ట్టేందుకు తీసుకుంటోంది, అయితే కేర‌ళ‌లో కూడా ఈ వైర‌స్ త‌న ప్ర‌తాపం చూపిస్తోంది, ఇక మ‌న దేశంలో తొలి పాజిటీవ్ కేసు కూడా కేర‌ళ‌లో గుర్తించారు, రాబోయే రెండు వారాలు క‌రోనా గురించి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని చెబుతున్నారు.

జాతీయ ఆరోగ్య సంస్థ కేర‌ళ శాఖ అంచ‌నా ప్ర‌కారం..ఒక్క కేర‌ళ‌లోనే రానున్న రోజుల్లో ఏకంగా 65 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోకే అవ‌కాశం ఉంద‌ట‌… అంత మందికి క‌రోనా సోకే అవ‌కాశం ఉంద‌ని కేర‌ళ శాఖ ఆ రాష్ట్ర హై కోర్టుకు ఇచ్చిన నివేదిక‌లో పేర్కొంద‌ట‌..దాదాపు ల‌క్ష మందికి ఐసీయూలో చికిత్స కోసం రెడీ చేయాలి అని చెప్పింది.

అయితే ఎక్క‌డో షిప్ లో ఉన్నా స‌గం మందికి క‌రోనా వ్యాపించింది అని ఆ లెక్కల ప్ర‌కారం కేర‌ళలో ఇలాంటి వార్త పుట్టింది, అయితే ఇలాంటివి న‌మ్మ‌ద్దు అని అధికారులు అంటున్నారు, ఇది జ‌ర‌గ‌ని పని అని ఇప్ప‌టికే దీనిని నివారించేందుకు త‌గిన ఏర్పాట్లు చేశాము అంటున్నారు.