తెలంగాణ రైతాంగ సాయుధ పోరు గడ్డ జనగామ గడ్డ పేరు నిలిపిన 70 ఏండ్ల రెడ్డి యువ రైతులు.

0
88
కొట్టం మధుసూదన్ రెడ్డి ఫేస్ బుక్ నుండి సేకరణ…….
రెడ్ల సభకు వచ్చి గర్జించిన ఈ 70 ఏండ్ల రెడ్డి యువ రైతులను చూసైనా పోరాడండి లేదా బానిసలుగా బతికి చావండి.
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్  చేస్తూ మార్చి6 న ఆదివారం జనగామ పట్టణంలో మేము నిర్వహించిన “రెడ్ల సభ”కు గ్రామాల నుండి భారీగా వచ్చిన 70 ఏండ్ల పై బడ్డ రెడ్డి రైతులు జనగామ చౌరస్తాలో మధ్యాహ్నం 12 గంటల కు అంబేద్కర్ కి పూలమాలలు వేసి , నివాళులు అర్పించి అక్కడినుండి సభా వేదిక వద్దకు 2 కిలోమీటర్లు నిర్వహించిన భారీ ర్యాలీలో భుజాన అంతెత్తు జెండామోస్తూ, ఎర్రటి ఎండకు ఉత్సాహంగా వడివడిగా నడుస్తూ 5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాటి సాయుధ పోరాట వీరుడు జనగామ ముద్దు బిడ్డ ఆరుట్ల రామ చంద్రా రెడ్డి వారసులమని,నిఖార్సయిన రెడ్డి బిడ్డలమని నిరూపించి మా ఉద్యమానికి మరింత ఊపిరి పోశారు.
కానీ మేము ఎంతో శ్రమ, డబ్బు, విలువైన సమయం, వయస్సు వెచ్చించి సభలు పెడితే తమబాధ్యతగా, తమ పిల్లల భవిష్యత్ కోసం 70 ఏండ్ల వృద్ధ రైతులు వ్యవసాయపనులు మానుకుని గ్రామాల నుండి వచ్చి ఉద్యమంలో పాల్గొంటే , పుస్తకాల దుకాణం, చెప్పుల దుకాణం, హోటళ్లలో,ఫైనాన్స్ కంపెనీలలో కనీసవేతనం లేని చిరు ఉద్యోగాలు చేసేవారు,ఏ ఉపాధిలేకుండ తిరిగే 30, 40 ఏండ్ల వాడు ఆదివారం అందుబాటులో ఉండి కూడా వాట్సప్, ఫేస్ బుక్ లలో సమయం వెచ్చిస్తూ వాడికి కనీసఅవగాహనలేని, అవసరం లేని పనికిమాలిన,సమాజానికి ఉపయోగంలేని గంటకొకసారి మారే కాపీపేస్ట్ చర్చల్లో కొందరుంటే, అప్పులు చేసి బార్లలో బీరు గ్లాసులతో మరికొందరు టైంపాస్ చేస్తుంటే ,ఇంకొందరు నాది ఆ పార్టీ ఈ పార్టీ అంటూ పార్టీలకు కొమ్ము కాస్తుంటే మన కనీసహక్కులు ,రెడ్డి కార్పొరేషన్ ఎలా సాధిస్తాం ? నీ కులం కనీస హక్కులే సాధించనోడివి రాజకీయపార్టీలలో ఉండి అన్ని వర్గాల ప్రజలను ఏం ఉద్ధరిస్తావ్? కనీస బాధ్యతలేని ఈ రెడ్డి బిడ్డలను ఏమనాలి ? వీడి హక్కుల కోసం కూడా వీడు పోరాడకుంటే వీడు రెడ్డి బిడ్డలెట్లయితడు ? వీడి హక్కుల కోసం BC, SC బిడ్డలు పోరాడాలా? వీడిహక్కుల కోసం పోరాడలేని శక్తిహీనునికి రెడ్డి పేరు ఎట్లా సరిపోతది? జరిగింది జరగని ఇకనైనా మేల్కొని,పార్టీలు పక్కనపెట్టి , సంఘటితంగా ఉద్యమించి రెడ్డి కార్పొరేషన్ తో పాటు మీ కనీస రాజ్యాంగ హక్కులను సాధించుకోండి.
కొట్టం మధుసూదన్ రెడ్డి