దక్షిణ సూడాన్ రాజధాని జూబా సమీపంలో ఓ విమానం కుప్పకూలింది. దీంతో అందరూ షాక్ అయ్యారు, అయితే ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది మరణించారని అధికారులు తెలిపారు,ఆ సమయంలో విమానంలో మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం కోసం డబ్బు తీసుకెళ్తున్న కార్గో విమానం అని తెలుస్తోంది, విమానం ప్రయాణిస్తున్న సమయంలో దక్షిణ సూడాన్ రాజధాని జూబా సమీపంలో కుప్పకూలింది. ఇక ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి అతను చికిత్స పొందుతున్నాడు.
ఈ ప్రమాదంలో నలుగురు దక్షిణ సూడాన్ దేశానికి చెందినవారు మరణించారు, అలాగే ముగ్గురు రష్యాకు చెందినవారు మరణించారు..పశ్చిమ బాహ్ర్ ఎల్-గజల్ రాజధాని వయూలో ఉన్న డబ్ల్యూఎఫ్‌పీ సిబ్బందికి జీతాలు తీసుకువెళ్లడానికి ఆంటొనోవ్ 36 విమానాన్ని ఆపర్ట్యూనిటీ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 26 లక్షల నగదు తీసుకువెళుతున్నారు, కాని మొత్తం నగదు అంతా కాలిబూడిద అయింది.