ఆ బాలుడికి సీఎం స్టాలిన్ స్పెషల్ గిఫ్ట్ పంపారు – ఏమిటో తెలుసా

ఆ బాలుడికి సీఎం స్టాలిన్ స్పెషల్ గిఫ్ట్ పంపారు - ఏమిటో తెలుసా

0
162

కొంతమంది చిన్న పిల్లలు చిన్న వయసులోనే అనేక సాయాలు చేస్తూ ఉంటారు… ఆడుకునే వయసులో సమాజం పట్ల సేవ సమాజం కోసం ఏదైనా చేయాలి అని తలంపుతో కొందరు ఉంటారు… వారు చేసే పనులు కూడా పది మందికి ఆదర్శంగా ఉంటాయి.. కొందరిలో మార్పుని తీసుకువస్తాయి.

 

మధురైలో హరీశ్ వర్మన్ అనే బాలుడు ఏడేళ్ల వయసులో ఉదారత్వాన్ని చాటుకున్నాడు.. అతను చేసిన పనికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ పిల్లవాడికి ఓ బహుమానాన్ని కూడా పంపారు. మధురైలో హరీశ్ వర్మన్ అనే బాలుడు తన తండ్రి రోజు ఇచ్చే డబ్బులు డిబ్బీలో దాచుకున్నాడు…దాంతో సైకిల్ కొనుక్కోవాలి అని అనుకున్నాడు.

 

ఆ బాలుడి తండ్రి ఎలక్ట్రీషియన్. ఇలా రెండు సంవత్సరాలుగా నగదు దాచుకున్నాడు, అయితే ఈనగదుని సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించాడు కోవిడ్ పేషెంట్లకు ఖర్చు చేయమని లేఖ కూడా సీఎంకు రాశాడు….ఇది చూసి సీఎం స్టాలిన్ ఎంతో ఆనందించి, ఆబాలుడికి ఫోన్ చేసి మాట్లాడారు, అంతేకాదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు… స్ధానిక ఎమ్మెల్యే ద్వారా ఆ బాలుడికి సైకిల్ ఇప్పించారు.