పన్నీరు సెల్వంకు భారీ షాక్..అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే..

0
109

తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వంకు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్‌ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికను సవాల్‌ చేస్తూ పన్నీర్‌సెల్వం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్‌బెంచ్‌ తీర్పు పన్నీర్‌సెల్వంకు అనుకూలంగా వచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ పళనిస్వామి ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్‌ సెక్రటరీగా పళనస్వామి కొనసాగవచ్చని ఇద్దరు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. సింగిల్‌బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్‌ హైకోర్టు కొట్టేసింది.