ఈటల రాజేందర్ కు చేదు అనుభవం..అసలేం జరిగిందంటే?

a bitter experience for Rajinder

0
171
Eatala Rajender

తెలంగాణ:హుజురాబాద్ ఉపఎన్నిక నగారా మోగిందో లేదో ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి పెద్దపాపయ్య పల్లికి వెళ్లిన ఈటలను అక్కడి ఓ కుటుంబం దూషిస్తూ దుమ్మెత్తిపోశారు. అసలు వారు అలా ఎందుకు చేశారంటే..ఒక సంవత్సరం క్రితం ప్రవీణ్ అనే యువకుడు చనిపోగా దానికి ఈటల కారణం అని అప్పట్లో వారు ఆందోళనకు దిగారు. తాజాగా ఈటల రాకతో తన కొడుకు చనిపోవడానికి నువ్వే కారణమంటూ..ఆ తల్లి శాపనార్ధాలు పెట్టడంతో ఈటల షాక్ కు గురయ్యారు. ప్రవీణ్ తండ్రి ఎందుకు వచ్చావ్ అంటూ..నిలదీయడంతో ఏమి చేయలేక..ఈటల రాజేందర్ వెనుదిరిగారు. అయిన కారు వరకు ప్రవీణ్ కుటుంబసభ్యులు రావడంతో కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడింది.