సాధారణంగా పుస్తకం విలువ వంద లేదా వెయ్యి ఉంటుంది… లేదా 10 వేలు అంతకంటే విలువైన ఖరీదైనది అయితే లక్ష ఉంటుంది ,ఇక చరిత్రకు సంబంధించి ఏనాటిదో అయితే కోటి రూపాయలు ఉండవచ్చు, అయితే ఇప్పుడు మీరు వినబోయే పుస్తకం ఖరీదు తెలిస్తే షాక్ ఆశ్చర్యం కలుగుతాయి.
ఇంగ్లిష్ పుస్తక పాఠకులకు ప్రముఖ రచయిత, నాటకకర్త విలియం షేక్స్పియర్ తెలిసే ఉంటుంది. , అసలు ఆయన తెలియని వారే ఉండరు, మరి ఆయన పుస్తకాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది, ఎన్నో సినిమాలు కథలు స్టోరీలు వచ్చాయి ఆయనవి,
తాజాగా షేక్స్పియర్ రచించిన మరో పుస్తకం అత్యధిక ధరకు వేలంలో అమ్ముడు పోయింది.
షేక్స్పియర్ 1632లో ఫస్ట్ ఫోలియో పేరుతో రచించిన మొదటి నాటక సంకలనాన్ని న్యూయార్క్లోని క్రిస్టీలో వేలం వేశారు. ఆ పుస్తకం ఏకంగా 73 కోట్ల రూపాయల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. అయితే ఎవరూ ఊహించని రేంజ్ లో దీనికి రేటు వచ్చింది..36 నాటకాలున్న ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ మాస్టర్ పబ్లికేషన్ ముద్రించింది. ఈ పుస్తక ముద్రణకు హెన్రీ కోండెల్, జాన్ హెమింగే అనే ఇద్దరు స్నేహితులు సహకరించినట్లు షేక్స్పియర్ తన పుస్తకంలో రాశారు.