ఆఫ్ఘనిస్థాన్ దేశం తాలిబన్ల వశమైన తర్వాత అక్కడ ప్రజల పరిస్దితి దారుణంగా మారింది. అక్కడ జనం వేరే ప్రాంతాలకు దేశాలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. అమెరికా నుంచి వస్తున్న విమానాలు ఎక్కాలి అని ప్రయత్నిస్తున్నారు. కాని అక్కడ వారికి అవకాశం లేదు ఇలా తమని ఈ ప్రాంతం నుంచి తీసుకువెళ్లండని వేలాది మంది ప్రజలు కాబూల్ఎయిర్ పోర్టుకి చేరుకుంటున్నారు.
మరోవైపు ఎయిర్ పోర్టు దగ్గర అత్యంత దారుణమైన పరిస్దితులు ఉన్నాయి. అక్కడ తాగునీటి కోసం, ఆహారం కోసం వారంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఆహారం దొరకక చాలా మంది నీరసంతో పడిపోతున్నారు. అంతేకాదు చిన్న పిల్లలు వృద్దులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
దీనిని అవకాశంగా తీసుకుని ఎయిర్ పోర్ట్ వెలుపల తాగునీరు, ఆహారాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఒక లీటర్ వాటర్ బాటిల్ మూడు వేలకు అమ్ముతున్నారట. ఒక ప్లేట్ భోజనాన్ని 7,500 అమ్ముతున్నారు, అంతేకాదు డబ్బులు డాలర్లుగా ఇస్తేనే ఈ ఫుడ్ ఇస్తాం అంటున్నారు. అక్కడ తిండికి కూడా ఎంతో మంది ఇబ్బందిపడుతున్నారు.