ఆ బిల్డింగ్ కూల్చేస్తాం- ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్

ఆ బిల్డింగ్ కూల్చేస్తాం- ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్

0
88

ఉత్త‌ర కొరియా ద‌క్షిణ కొరియా రెండు విభిన్న దృవాలు అస్సలు ప‌డ‌ని దేశాలు, ఒక‌రికి ఒక‌రు నిత్యం వివాదాల‌తోనే ఉంటాయి, అయితే దక్షిణ కొరియాతో తమ సంబంధాలు తెంచుకునే సమయం వచ్చేసిందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జాంగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. .

ద‌క్షిణ కొరియాపై ఆమె సోద‌రుడు కూడా సీరియ‌స్ గా ఉన్నారు..దాయాది దేశమైన దక్షిణ కొరియాపై కఠిన చర్యలు తీసుకోనున్నామని, ఈ మేరకు సైన్యానికి అధికారాలు అప్పగించామని తెలిపారు.
దక్షిణ కొరియాతో తమకున్న కొద్దిపాటి సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రెండు దేశాల మధ్యా పనికిరాని సంబంధాలకు వేదికగా నిలిచిన అనుసంధాన కార్యాలయం నేలమట్టం అయ్యే క్షణాలు త్వరలో రానున్నాయని, అది విధ్వంసమయ్యే దృశ్యాలను త్వరలోనే చూడబోతున్నారని ఆమె అన్నారు. ఇక స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర కిమ్ ధోరణిని నిరసిస్తూ, బెలూన్లను దక్షిణ కొరియా వాసులు ఎగురవేయగా, కిమ్ సర్కారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అక్క‌డ ప‌త్రిక‌లు మీడియాలు కూడా కిమ్ పై విష‌పు వార్త‌లు ఇచ్చాయి, ఇవ‌న్నీ కూడా సీరియ‌స్ గా తీసుకున్నారు కిమ్ .