ఆ ఛానల్ పై ఏపీ ఉప ముఖ్యమంత్రి సీరియస్

ఆ ఛానల్ పై ఏపీ ఉప ముఖ్యమంత్రి సీరియస్

0
110

జర్నలిజంలో అవాస్తవాలు చెప్పకూడదు, రాయకూడదు అనేది మొదటి నియమం …కాని కొందరు మాత్రం ఇవే పనులు చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో రోజు రోజుకి పెరుగుతోంది, ఈ సమయంలో ఏది వార్తగా వచ్చినా ప్రజలు నమ్ముతున్నారు.

అయితే ఏపీలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి, ఈ సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్లో జరిగిన ప్రార్థనల వల్ల చాలా మందికి కరోనా వైరస్ వ్యాధి సోకింది అని తేలింది.
అయితే ఆ ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కూడా వెళ్లారని వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందించారు.

అసలు తాను ఆ ప్రార్ధనలకు వెళ్లలేదు అని తెలిపారు.మార్చి 2న ముస్లింలకు సంబంధించిన 4 శాతం రిజర్వేషన్ల కేసు విషయంపై మాత్రమే తాను ఢిల్లీ వెళ్లానని చెప్పారు. తర్వాత తాను మార్చి 5 నుంచి 26 వరకు కడపలోనే ఉన్నానని వివరించారు. కావాలనే ఓ మీడియా తనపై ఇలాంటి వార్తలు వైరల్ చేస్తోందని దానిపై పరువు నష్టం దావా వేస్తాను అన్నారు.