అన్నీ దేశాల్లో కరోనా మహమ్మారి ఎంత వేగంగా విజృంభించిందో తెలిసిందే, దారుణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి లక్షలాది మంది కరోనాతో మరణించారు ..గత ఏడాది నుంచి కోట్ల మందికి కరోనా సోకింది, అయితే అన్నీ దేశాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి, అయితే ఓ దేశంలో మాత్రం అక్కడ ప్రజలు ఇక కరోనా భయం లేదు అని భావిస్తున్నారు. అంతేకాదు హ్యాపీగా మాస్క్ లేకుండా తిరగవచ్చు అని చెబుతోంది ప్రభుత్వం.
కరోనా వైరస్ ను ఎదుర్కొన్నాం..ఇక మాస్క్ లతో పని లేదంటోంది ఇజ్రాయిల్ ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది… అన్నీ దేశాలు విలయంగా ఉంటే అక్కడ మాత్రం మాస్క్ అక్కర్లేదు అంటున్నారు.
ఎందుకు అంటే దేశంలో సగానికి పైగా జనాభాకి వాక్సినేషన్ పూర్తి అయింది. అందుకే దేశంలో అందరూ బహిరంగప్రదేశాల్లో తప్పనిసరిగా..మాస్కులు ధరించాలన్న ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేసింది..ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ప్రజలకు టీకాలు అందించి కరోనా వైరస్ ను ఎదుర్కొవడంలో విజయం సాధించామని చెబుతున్నారు.
అక్కడ ప్రభుత్వం ఫైజర్, బయోఎన్ టెక్ టీకాలను అందించింది. దేశంలో ఉన్న 93 లక్షల మందిలో దాదాపు 53 శాతం మందికి టీకా ఇచ్చారు.