ఆ ద‌ర్శ‌కుడితో ప‌వ‌న్ పొలిటిక‌ల్ ట‌చ్ సినిమా చేయ‌నున్నారా ?

ఆ ద‌ర్శ‌కుడితో ప‌వ‌న్ పొలిటిక‌ల్ ట‌చ్ సినిమా చేయ‌నున్నారా ?

0
88

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఓ ప‌క్క రాజ‌కీయ పోరాటంలో ముందు ఉన్నారు, అయితే ప‌వ‌న్ ఇప్పుడు మ‌ళ్లీ సినిమాలు లైన్ గా ఒకే చేస్తున్నారు, వ‌కీల్ సాబ్ చిత్ర షూటింగ్ కూడా పూర్తి అవుతోంది, క‌రోనాతో షూటింగ్ కు బ్రేకులు ప‌డ్డాయి‌, త‌ర్వాత క్రిష్ తో మూవీ చేయ‌నున్నారు.

క్రిష్‌తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయనున్నారు.. క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా ఉండనుంది. అయితే ఈ చిత్రంలో ప‌వ‌న్ మ‌ళ్లీ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్న‌ర‌నే వార్త‌లు ఈ మ‌ధ్య వినిపించాయి.

అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈరెండిటిలో ఏది వాస్త‌వ‌మో ఇంకా తెలియ‌దు, అయితే పొలిటిక‌ల్ గా ప‌వ‌న్ కు మైలేజ్ వ‌చ్చేలా ఈ క‌థ ఉంటుంది అనే టాక్ అయితే న‌డుస్తోంది, ప‌వ‌న్ చేతిలో ఉన్న రెండు చిత్రాలు పూర్తి అయ్యాక హ‌రీష్ చిత్రం వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభించ‌నున్నారట‌.