ఆ ఉద్యోగులు అందరికి గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

ఆ ఉద్యోగులు అందరికి గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

0
86

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా దాని ప్రభావం చూపిస్తోంది, ఈ సమయంలో ఆర్ధిక వ్యవస్ధ అతి దారుణమైన స్దితికి చేరుకుంది. రాష్ట్రాల్లో కూడా దారుణమైన పరిస్దితి ఆర్ధికంగా కటకటలాడుతున్నారు, పది రోజులుగా రెవెన్యూ అనేది లేదు. ఈ లాక్ డౌన్ సమయంలో ఉపాది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వారికి ప్రభుత్వం రేషన్ నగదు సాయం చేస్తోంది.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ సగం వేతనమే చెల్లిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ విషయంలో ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఎవరికి అంటే కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసు సిబ్బందికి మార్చి నెల జీతం పూర్తి చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

అయితే ఇది మంచి నిర్ణయం అని చెప్పాలి.. ప్రాణాలను పణంగాపెట్టి వారు ఉద్యోగం చేస్తున్నారు, ఈ సమయంలో వారికి పూర్తి జీతం ఇవ్వడం మంచిదే అంటున్నారు ప్రజలు. మొత్తానికి వారికి పూర్తి జీతం అందనుంది, మిగిలిన వారికి తర్వాత ఆ కట్ చేసిన జీతం జమ చేయనుంది సర్కార్.