దేశంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే, వైద్యులు అధికారులు చాలా మంది టీకా తీసుకున్నారు, వారిపై బాగానే పనిచేస్తోంది, అయితే తాజాగా కీలక ప్రకటన చేసింది కేంద్రం. - Advertisement -
దేశంలో 60 ఏళ్ల పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక మరో విషయం ఏమిటి అంటే ఎవరైనా ఒకటి లేదా రెండు వ్యాధులతో బాధపడుతున్న వారు ఉంటే వారికి 45 ఏళ్లు పైబడి ఉన్నా వారికి టీకా ఇస్తారు . ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు, ఇక మరో ముఖ్య విషయం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ టీకా ఉచితంగా ఇస్తారు, ఇక ప్రైవేట్ ఆస్పత్రిలో మాత్రం నగదు చెల్లించాలి. అయితే ప్రైవేటు ఆసుపత్రులు ఎంత వసూలు చేయాలో మూడు, నాలుగు రోజుల్లో ఆరోగ్యశాఖ ప్రకటన చేయనుంది.
|
|
|
కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన – మార్చి 1 నుంచి వారికి వ్యాక్సిన్
-