తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి సర్కార్ పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.
శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించి నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. స్కూల్స్ లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘మన ఊరు – మన బడి’ప్రణాళిక కోసం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.