తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామం..సీఎం కేసీఆర్‌తో పీకే భేటీ అందుకేనా?

A key development in Telangana politics .. Will PK meet with CM KCR?

0
79

జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించనుందా? ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఆ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న సీఎం కేసీఆర్ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. దీనితో జాతీయ రాజకీయాల్లో వ్యూహాత్మక అడుగులు పడుతున్నట్టు అర్ధం అవుతుంది.

హుజురాబాద్ ఉపఎన్నిక నుంచి టీఆర్ఎస్‌ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై చేస్తున్న పోరాటానికి సరైన స్పందన రాకపోవడం, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్స్ ఇచ్చిన షాకులతో గులాబీ పార్టీ టెన్షన్‌లో పడింది. అసెంబ్లీ ఎన్నిలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉన్నందున పార్టీ తిరిగి పుంజుకోవడం, ప్రజల్లోకి బలంగా వెళ్లడంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. దీనితో తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ పండితుడు అయిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో సందడి చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.

టీఆర్ఎస్ ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌తో పని చేయనుందా అన్న వార్తలు వినపడుతున్నాయి. నిన్న ప్రగతిభవన్‌లో ఐప్యాక్‌ ప్రతినిధులతో టీఆర్ఎస్ నేతల సమావేశం కావడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. జాతీయ రాజకీయ పరిణామాలు…ఈ మధ్య కేసీఆర్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల అభిప్రాయాలు, సంక్షేమ పథకాలపై ఐప్యాక్ సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వానికి ఆదరణ తగ్గుతోందని ఆందోళన చెందుతున్నారని చెబుతున్న కేసీఆర్.. తన వైఫల్యాలకు గల కారణాలను అర్థం చేసుకోవాలన్నారు. అధికార వ్యతిరేకత మరింత వేగం పుంజుకుంటోందని భావిస్తున్న తరుణంలో పీకే టీమ్ సర్వే టీఆర్‌ఎస్‌కు ఎంతగానో కలిసి రానుంది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం పీకే టీం నుంచి సర్వే మద్దతును మాత్రమే కోరుతున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో వరుసగా మూడోసారి కూడా అధికారం చేపట్టాలని టార్గె్ట్ పెట్టుకున్న కేసీఆర్ రాబోయే రోజుల్లో పీకే టీమ్‌ సేవలు పూర్తిస్థాయిలో పొందే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆర్భాటంగా పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు సైతం పీకే టీమ్ సేవలు అందిస్తుండటం విశేషం.