పంజాబ్ కాంగ్రెస్ లో కీలక పరిణామం..సిద్ధూకు అధిష్టానం బుజ్జగింపులు

A key development in the Punjab Congress

0
79

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ క్రికెటర్‌ నవ్యజోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కలుసుకున్న అనంతరం తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సిద్ధూ తన రాజీనామా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతే కాదు గత నెల సిద్ధూ కాంగ్రెస్‌ పంజాబ్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంకేతమిచ్చిన్న సిద్ధూ అనంతరం కాంగ్రెస్‌ అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడ్డట్లు కనిపించారు గానీ అధికారికంగా మాత్రం ఉపసంహరించుకోలేదన్న సంగతి తెలిసిందే.

రాహుల్‌ గాంధీతో జరిగిన భేటీలో తాను లేవనెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈమేరకు పంజాబ్‌ కాంగ్రెస్‌ కమిటీ  అధ్యక్షుడిగా తన విధులను యథావిధిగా తిరిగి కొనసాగిస్తునున్నట్లు పేర్కొన్నారు.  పంజాబ్‌ నూతన అధ్యక్షుడు చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్నీ క్యాబినేట్‌లోని అధికారుల నియమాకాల పై తీవ్ర అసంతృప్తితోపాటు, ఇటీవల చన్నీ కుమారుడి వివాహానికి కూడా సిద్ధూ దూరంగా ఉండటం తదితర పరిణామాలన దృష్ట్య కాంగ్రెస్‌లో అంతర్గత ఉద్రిక్త వాతావరణం​ మళ్లీ తెరపైకి  వచ్చింది.

ఈ మేరకు “సిద్ధూ కూడా తాన తన పదవికి రాజీనామా చేసిన గానీ ‘తాను గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. తాను కాంగ్రెస్‌ పార్టీలో పదవి ఉన్నా..లేకున్నా రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్‌లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను” అంటూ ట్విటర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.