పుట్టిన‌రోజు స్పెష‌ల్ రూపాయికే లీట‌ర్ పెట్రోల్

A liter petrol cost is one rupee

0
102

కొంద‌రు అనుచ‌రులు త‌మ అభిమాన నాయ‌కుడి పుట్టిన రోజుని పండుగలా చేస్తారు.
మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే పుట్టిన రోజును పురస్కరించుకుని శివసేన మద్దతుదారులు ఎంతో ఆనందంగా ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌లు చేస్తున్నారు. అయితే ఎవ‌రూ చేయ‌ని విధంగా ప్ర‌జ‌ల‌కు ఓ ఆఫ‌ర్ ఇస్తున్నారు.

డోంబివిలిలో రూపాయికే లీటరు పెట్రోలును పంపిణీ చేశారు. డోంబివిలి ఎంఐడీసీ ప్రాంతంలోని ఉస్మా పెట్రోలు పంపు ద‌గ్గ‌ర‌ డోంబివిలి యువసేన నేత యోగేశ్ మహాత్రే, ఇలా రెండు గంట‌ల పాలు పెట్రోల్ ని లీట‌ర్ రూపాయికి అందించారు.

నిన్న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటలపాటు ఇలా అందించారు.
ఇక ఈ విష‌యం తెలిసి పెద్ద ఎత్తున పెట్రోల్ కోసం జ‌నం క్యూ క‌ట్టారు. ఇక మ‌రోచోట అంబర్‌నాథ్‌లో శివసేన నేత అరవింద్ వాలేకర్ కూడా, 50 రూపాయలకే పెట్రోలును పంపిణీ చేశారు. త‌మ నాయ‌కుడిపై అభిమానం చూపించారు నేత‌లు.